Tuesday, February 8, 2011
చిరంజీవి సైడ్‌హీరోలా మారనున్నాడు’
చిరంజీవి సైడ్‌హీరోలా మారనున్నాడు
నెల్లూరు : కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనంతో చిరంజీవి సైడ్ హీరోలా మారనున్నాడని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలం తగ్గిపోయినందుకే చిరంజీవిని పార్టీలోకి తీసుకున్నారన్నారు. వెంకయ్యనాయుడు మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు.
శంకరరావు ఇంటి వద్ద పీడీఎస్‌యూ ధర్నా
హైదరాబాద్ : చేనేత శాఖ మంత్రి శంకరరావు నివాసం ఎదుట పీడీఎస్‌యూ కార్యకర్తలు మంగళవారం ఆందోళన చేపట్టారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేలా యూపీఏ సర్కార్‌పై ఒత్తిడి తీసుకురావాలంటూ వారు మంత్రిని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో బీజేపీకి మనుగడ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలు సమంజసంగా లేవని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ మునిగిపోయే నావగా అభివర్ణించారు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల్లో బీజేపీకే మంచి భవిష్యత్ ఉందన్నారు. 2జీ స్పెక్ట్రమ్ తాజా ఆరోపణలపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
Labels:
NEWS
NEWs
మీడియాపై చంద్రబాబు అక్కసు
గుంటూరు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం గుంటూరులో మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. టీవీ ఛానళ్లు ప్యాకేజీలుగా వార్తలను ప్రసారం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం కష్టపడుతున్న తనకు కేవలం మూడు నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నారన్నారు. 32 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తాను తనకన్నా వెనక రాజకీయాల్లోకి వచ్చినవారితో పోటీపడాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో తనకు తెలుసని చంద్రబాబు అన్నారు.
'సోనియా అవినీతి రాణిగా వెలుగుతున్నారు'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కామన్వెల్త్, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాలతో సోనియా అవినీతి రాణిగా వెలుగుతున్నారని మంగళవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ఇటలీ బ్యాంక్‌లో ఆమె బంధువుల పేరిట ఉన్న నల్లదనాన్ని వెలికి తీయాలని గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి ‘జనగణమన’ స్పష్టంగా పాడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా
మంత్రి డీఎల్‌కు అంబటి సవాల్
* చచ్చుపుచ్చు మాటలు మాట్లాడటానికి సిగ్గుండాలి
* చిరంజీవి వ్యాఖ్యలు వైఎస్ కారణంగా లబ్ధిపొందిన
* తెలుగు ప్రజానీకం గుండెల్లో గునపాల్లా గుచ్చుకున్నాయి
* మహానేత రెక్కలకష్టంతో పదవులనుభవిస్తున్న
* మంత్రులకు సిగ్గూ శరమూ ఉంటే క్షమాపణ చెప్పించాలి
పేరవరం (తూర్పుగోదావరి), న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ‘వందే మాతరం’ కానీ, ‘జనగణమన’ కానీ స్పష్టంగా ఎవరి సాయమూ లేకుండా పాడితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు సవాల్ చేశారు. పోలవరం లోతు, పొడవు తెలియదంటూ యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డికి అధికారం అప్పగించారని.. దురదృష్టవశాత్తూ ఆయన మరణిస్తే.. ఆ అధికారం పంచుకోవడానికి, కక్కిన కూటిని తినడానికి కాంగ్రెస్‌లోకి వచ్చిన చిరంజీవి.. మహానేతపై విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు. వైఎస్ హయాంలో మంత్రులుగా ఉన్నవారికి నిజంగా సిగ్గూశరమూ ఉంటే చిరంజీవితో క్షమాపణ చెప్పించాలని, లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సోమవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా పేరవరంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇది తెలుగు రాష్టమ్రని, తెలుగు రాష్ట్రానికి సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి చేతనైతే ‘విష్వక్సేనుడు’ అనే తెలుగు పేరును ఉచ్ఛరించి చూపాలని అంబటి సవాల్ విసిరారు. చచ్చుపుచ్చు మాటలు మాట్లాడటానికి సిగ్గనిపించడం లేదా? అని డీఎల్‌నుద్దేశించి అంబటి ప్రశ్నించారు. ఇలాంటి మాటలు మాట్లాడటానికే రవీంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. పదవి కోసం అంతకుముందు కూడా వైఎస్‌ను, ఆయన కుటుంబాన్ని రవీంద్రారెడ్డి విమర్శించారని, దూషించారని చెప్పారు. ఇప్పుడాయన కుమారుణ్ణి కూడా తిట్టే దౌర్భాగ్యస్థితికి దిగజారారని తెలిపారు. తెలుగు సరిగా మాట్లాడటం రాని ముఖ్యమంత్రి పరిపాలనలో మంత్రిగా ఉన్నందుకు సిగ్గుపడాలని అన్నారు.
చిరంజీవికి ప్రజలే బుద్ధి చెబుతారు
ప్రజారాజ్యం పార్టీని మోయలేక కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ పక్కన ఉండగా 2004-09 మధ్య కాలంలో అవినీతితో కూడిన పరిపాలన సాగిందని, అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపించడం దురదృష్టకరమని అంబటి తెలిపారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంత బ్రహ్మాండంగా పరిపాలన సాగించారో చెప్పడానికి 2009లో ఆయన రెండోసారి అధికారంలోకి రావడమే మంచి ఉదాహరణ అని చెప్పారు. అప్పుడే చిరంజీవి కూడా పార్టీ పెట్టారని, పార్టీలన్నీ ఏకమై పోటీ చేశాయని, అయినప్పటికీ వైఎస్ ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారని వివరించారు. మహానేత వైఎస్ అందించిన అద్భుతమైన పాలన వల్లే ప్రజలు ఆయన్ను ఆశీర్వదించి అధికారం అప్పగించారని అన్నారు. నేడు ఆ అధికారం పంచుకోవడానికి, కక్కిన కూటిన తినడానికి కాంగ్రెస్‌లోకి వస్తూ.. చిరంజీవి వైఎస్‌పై ఆరోపణలు చేశారని ఎద్దేవా చేశారు. చిరంజీవి వైఎస్‌ను అవమానించేలా మాట్లాడినా కాంగ్రెస్ నేతలు కానీ, రాజశేఖరరెడ్డి హయాంలోనూ మంత్రులుగా ఉన్న ప్రస్తుత మంత్రులు గానీ మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.
‘అవినీతి పాలన అని చిరంజీవి విమర్శించినందుకు సిగ్గుపడాలో..తలదించుకోవాలో మంత్రులు ఆలోచించుకోవాలి. అది మీరు సమష్టిగా సాగించిన పాలనే కదా..’ అని గుర్తుచేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన *2 కిలో బియ్యంతో కడుపునింపుకుంటున్న పేదలకు, ఆరోగ్యశ్రీతో ఆరోగ్యాలు బాగుపడిన తెలుగువారికి మాత్రం చిరంజీవి వ్యాఖ్యలు శూలాల్లా తగిలాయని అంబటి చెప్పారు. అదేవిధంగా పావలావడ్డీతో లబ్ధిపొందిన మహిళలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులు చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల గుండెల్లో గునపాల్లా దిగాయని అన్నారు. వీరంతా చిరంజీవికి త్వరలో బుద్ధిచెప్పడం ఖాయమని హెచ్చరించారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని మోయలేకపోతే, కాంగ్రెస్ దాన్ని ఆలింగనం చేసుకుందని, ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో కలుస్తోంటే.. ప్రజలకు అది ఏపార్టీయో అర్థం కాక ‘కాంగ్రెస్ రాజ్యం’ అనుకుంటున్నారని, ఈ కాంగ్రెస్ రాజ్యాన్నీ, కలిసిన వారిద్దరినీ తెలుగు ప్రజానీకం కట్టగట్టి గోదాట్లో ముంచే రోజు దగ్గర్లోనే ఉందని తెలిపారు. వైఎస్ వల్లే పదవులు వచ్చిన విషయం గుర్తుకుతెచ్చుకుని.. మంత్రులు చిరంజీవితో క్షమాపణ చెప్పించాలని, లేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పదవులే ముఖ్యమనుకుంటే నైతికంగా పతనమవుతారని హెచ్చరించారు. వైఎస్ రెక్కల కష్టం వల్లే చాలామంది అప్పుడూ, ఇప్పుడూ మంత్రులుగా ఉన్నారని చెప్పారు.
బాబుకు ఇక కష్టకాలమే: చిరు
జైపాల్‌రెడ్డితో గంటపాటు సమావేశం
సమయం, సందర్భం వచ్చినప్పుడు గాంధీభవన్‌కు వెళ్తానని వెల్లడి
న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: బాబుకికి కష్టకాలమేనని, ఆ భయంతోనే తమపై వ్యాఖ్యలు చేస్తున్నారని పీఆర్‌పీ అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, పీఆర్పీల కలయిక ఎంత గట్టిదో ఆయన మాటలే చెప్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌లో పీఆర్‌పీ విలీనంపై టీడీపీ, బీజేపీ, సీపీఐ నేతల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య, ఇతర నాయకులతో కలిసి ఆయన సోమవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లి గంటసేపు మంతనాలు జరిపారు. అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల నేతల వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. ‘‘వారలా అనకుండా చాలా సంతోషం, శుభమని అంటారా? భవిష్యత్తులో బాబు పరిస్థితి, అస్తిత్వం ప్రమాదంలో పడనున్నాయి.
అం దుకే అలా మాట్లాడుతున్నారు. రెండు శక్తులు కలిస్తే ఎదుర్కోవడం చాలా కష్టం. రాబోయే కష్టకాలాన్ని తల్చుకుంటూ భయాందోళనలతోనే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా లేదు. అస్తిత్వం కోల్పోతున్న ఆ పార్టీని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. సీపీఐ నేత నారాయణ మాటల్ని సీరియస్‌గా తీసుకోనక్కర్లేదు. ఆయన ఏది మాట్లాడతారో తెలీదు. వాటికి లెక్కలేదు’’ అని అన్నారు. ‘‘జైపాల్‌రెడ్డితో నాకు చిరకాల పరిచయం. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా చెప్తాను. సార్‌తో ఉన్న అనుబంధం అలాంటిది. చరిత్రాత్మక సంఘటన జరుగుతున్నందున వారి ఆశీస్సులు, ఆతిథ్యం స్వీకరిద్దామని వచ్చాను’’ అని చెప్పారు. పార్టీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా సమర్థంగా నిర్వర్తిస్తానని చెప్పారు. ఏ ధ్యేయంతో కాంగ్రెస్‌తో కలిశామో దాని సాధనకు ముందుకెళ్తామన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు గాంధీభవన్‌కు వెళ్తానన్నారు. అంతకు ముందు చిరంజీవిని కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ కలుసుకొని, మధ్యాహ్నం తన ఇంట్లో విందుకు రమ్మని ఆహ్వానించారు. అయితే చిరంజీవి వెళ్లకుండా పార్టీ నాయకులనే పంపారు.
చిరంజీవిది చరిత్రాత్మక నిర్ణయం: జైపాల్
చిరంజీవి విశేష జనాకర్షణ, జనాదరణ ఉన్న నాయకుడని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేయాలన్న చిరంజీవి నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ఇది కాంగ్రెస్‌ని బలోపేతం చేస్తుందని అన్నారు. పార్టీలో ఓ వర్గాన్ని అణచివేసేందుకే చిరంజీవిని తెచ్చారన్న విమర్శల్ని ప్రస్తావించగా.. ‘‘ఇంత పెద్ద పరిణామం జరిగినప్పుడు ఎన్నో రకాల ప్రతిక్రియలు సహజం. వాటికి జవాబివ్వాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. చిరంజీవికి ఎలాంటి పాత్ర ఉండాలో ఆయనే నిర్ణయిస్తారని, పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ నేతల విమర్శలను ప్రస్తావించగా.. ‘‘మేమంతా ఒక జాతీయ పార్టీలో ఉన్నాం. రాష్ట్రం ఒకటిగా ఉన్నా లేకున్నా జాతీయ పార్టీలో ఉంటాం. కాబట్టి ఈ (విలీన) నిర్ణయానికి, అక్కడి ఉద్యమాలకు సంబంధం లేదు’’ అని చెప్పారు. 2014 ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వంలో పార్టీని గెలిపిస్తారా అని ప్రశ్నించగా.. దీనిపై సోనియా తప్ప మరెవ్వరం జవాబివ్వలేమని అన్నారు.
ప్రణబ్‌ను కలిసిన చిరంజీవి బృందం: చిరంజీవి, ఇతర నేతలు కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. సోమవారం రాత్రి 9.30 గంటలకు నార్త్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయానికి వెళ్లి పావు గంట పాటు భేటీ అయ్యారు. పార్టీలో నడచుకొనే విధానం, పార్టీ బలోపేతానికి చర్యలు, విలీనం ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అంశాలపై చిరుకు ప్రణబ్ మార్గదర్శకం చేశారు. చిరంజీవిని ఇంటికి పిలిచి ప్రత్యేకంగా విందు ఇవ్వాలని ప్రణబ్ తొలుత భావించినప్పటికీ, చివరి నిమిషంలో మనుసు మార్చుకుని కార్యాలయానికి రమ్మని చెప్పారు. భేటీ అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రణబ్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, సమస్యలు, నిధుల అంశాలు ఏవీ ప్రస్తావనకు రాలేదన్నారు. రాష్ట్రం పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ‘‘మా కలయిక పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, కేడర్‌లో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని ప్రణబ్ అన్నారు’’ అని చెప్పారు. పార్టీ బలోపేతానికి కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని, దాని ప్రకారం ముందుకెళ్లాలని సూచించారని తెలిపారు. ఆయన సలహాలు సూచనలు కావాలని కోరగా, ఖచ్చితంగా అందిస్తానని చెప్పారన్నారు.

Subscribe to:
Posts (Atom)