CINEMA

జోరు మీదున్న ఎన్టీఆర్! October 30, 2013


‘అమ్మ తోడు అడ్డంగా నరుకుతా’... అంటూ ‘ఆది’లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇప్పుడిప్పుడే విన్నట్టుగా ఉంది. కానీ, కాలం వేగంగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా విడుదలై పదేళ్లకు పైనే అయ్యింది. అప్పట్లో ఎన్టీఆర్, బెల్లంకొండ సురేష్ కాంబినేషన్‌లో ఇదో సంచలనాత్మక చిత్రం. పదేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. ఎన్టీఆర్, విలన్ బృందం పాల్గొనగా ఓ ఫైట్‌ను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
 
  కాగా, ఈ చిత్రం ప్రారంభదశ నుంచీ ‘రభస’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారనే వార్త వచ్చింది. ఆ టైటిల్‌ని ఖరారు చేయలేదని చిత్రబృందం చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ‘జోరు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘రభస’ కన్నా ‘జోరు’ బాగుందని ఎన్టీఆర్ కూడా భావిస్తున్నారట. టైటిల్ సంగతి ఎలా ఉన్నా... ప్రస్తుతం చిత్రీకరిస్తున్న ఫైట్‌లో మాత్రం ఎన్టీఆర్ జోరుగా, హుషారుగా పాల్గొంటున్నారట. ఈ చిత్రంలో సమంత, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు.
 




"శక్తి" 19 నుంచి
 (Sep 16 10)







వైజయంతీ మూవీస్ పతాకంపై, యంగ్ టైగర్ యన్.టి.ఆర్.హీరోగా,నలక నడుము గోవా భామ ఇలియానా హీరోయిన్ గా,మెహెర్ రమేష్ దర్శకత్వంలో, చలసాని అశ్వనీదత్ నిర్మిస్తున్న చిత్రం "శక్తి".ఈ చిత్రం షూటింగ్ 19 నుండి తిరిగి ప్రారంభం కాబోతూంది. ప్రస్తుతం యన్.టి.ఆర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై,వంశీ పైడిపల్లి దర్శకత్వంలో,దిల్ రాజు నిర్మిస్తున్న "బృందావనం" చిత్రంలో నటిస్తున్నారు.ఈ బృందావనం చిత్రం షుటింగ్ దాదాపు పుర్తయింది. "శక్తి" చిత్రాన్ని డిసెంబర్ నెలలో క్రిస్ మస్ కానుకగా విడుదల చేసేమదుకు నిర్మాత అశ్వనిదత్ సన్నాహాలు చేస్తున్నారట.


మళ్ళీ "రాముడు-భీముడు" (Sep 16 10)






గతంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, విశ్వవిఖ్యాతనటసార్వభౌమ,నటరత్న,డాక్టర్ నందమూరి తారకరామారావు గారు హీరోగా ద్విపాత్రాభినయంలో నటించగా,నిర్మాతగా డాక్టర్ డి.రామానాయుడు తొలిసారి నిర్మించిన చిత్రం"రాముడు-భీముడు". ఈ చిత్రం ఘనవిజయం సాధించి,నిర్మాతగా రామానాయుడుగారిని నిలబెట్టిన చిత్రమిది.ఈ చిత్రాన్నిపెద్దాయన మనవడు జూనియర్ యన్ టి ఆర్ హీరోగా పునర్నిర్మించాలని రామానాయుడు సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రం త్వరలో ప్రారంభమయ్యే సూచనలు బలంగా కనపడుతున్నాయి.ఈ చిత్రం కోసం జూనియర్ యన్ టీ ఆర్ డేట్లు సర్దుబాటు చేసే పనిలో ఉన్నారట. 


సుమంత్,ప్రియమణి లిప్ లాక్
 (Sep 16 10)
సుమంత్ చూట్టానికి చాలా నిదానస్తుడులా కనిపిస్తాడు కానీ, అవసరమైతే తాను కూడా స్పీడేనని నిరూపిస్తాడని ఈ మధ్యే మీడియాకి, తద్వారా ప్రేక్షకులకు తెలిసింది.విషయానికి వస్తే కుమార్ బ్రదర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై, సుమంత్ హీరోగా,అందాల ప్రియమణి హీరోయిన్ గా,వి.జి.సి.పి.విష్టా దర్శకత్వంలో, కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న చిత్రంలో సుమంత్, ప్రియమణిల లిప్ లాక్ ముద్దు సీన్ ఈ మధ్య చిత్రీకరించారట.ఈ సిన్లో సుమంత్ మాత్రం ఏకంగా జీవించేశాడని వార్త.అలాగే ఈ సీన్లో ప్రియామణి కూడా బాగా ఎంజాయ్ చేస్తూ నటిందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఈ చిత్రంలోనే దర్శకుడు స్వర్గీయ శోభన్ పిల్లలు కూడా నటిస్తున్నారట. 


నిర్మాతకి క్లాస్ పీకారు (Sep 15 10)
మామూలుగా నిర్మాత అంటే సినీ పరిశ్రమలో ఒకవిధమైన గౌరవం ఉంటుంది.అలాంటి నిర్మాతకు క్లాస్ పీకారంటే ఎవరో గోప్పవాళ్ళై ఉంటారనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఒక నిర్మాతను థియేటర్ గేట్ వద్ద ఉండే గేట్ కీపర్లు అలా క్లాస్ పికింది.ఇంతకీ ఆ నిర్మాత ఎవరంటారా...? ప్రముఖ నిర్మాత,దక్షిణభారత ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు సి.కళ్యాణ్. ఆయన తన సారథ్యంలో వచ్చిన "కొమరంపులి" చిత్రం చూసేందుకు తన కుటుంబంతో సహా జివికె ఐనోక్స్ థియేటర్ కి వెళ్ళారు. అక్కడి థియేటర్ సిబ్బంది "ఎ" సర్టిఫికేట్‍ సినిమాకి చిన్నపిల్లలను తీసుకురావటానికి వీల్లేదు.ఇంత పెద్దగా ఉన్నావ్ నీకీ మాత్రం తెలియదా అంటూ క్లాస్ పీకారట. దాంతో నానా ట్లూ పడి, వాళ్లకి నచ్చచెప్పి థియేటర్లోకి వెళ్ళాల్సొచ్చిందట సి.కళ్యాణ్. 



థియేటర్లలో న్యూస్ రీళ్లు, జనగణమన తప్పనిసరి


సినిమా థియేటర్లలో న్యూస్‌రీళ్ళు డాక్యుమెంటరీలు త ప్పనిసరిగా ప్రదర్శించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించిం ది. ప్రజల్లో వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు న్యూస్‌రీళ్ళు తప్పనిసరిగా ప్ర దర్శించాలని సమాచార శాఖ కమిషనర్ పార్ధసారథి ఆదేశాలు జారీ చేశారు. వీటి ప్రదర్శనకు గతంలో నిబంధనలు ఉన్నా థియేటర్ల యాజమాన్యాలు వీటిని బేఖాతరు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం రూపొందించిన న్యూస్‌రీళ్ళు డాక్యుమెంటరీలు డబ్బాలలోనే మగ్గుతున్నాయి. ఎన్నో వ్యయప్రయాసలకోడ్చి ఫిలిండివిజన్ వీటిని ప్రతి ఏటా రూపొందిస్తున్నది. సినిమా తర్వాత జనగణమనను కూడా ప్రదర్శించాలని స్పష్టం చేసింది.


Movie Name"గాయం-2"TeluguOne's Rating : 2.75/5
Bannerకర్త క్రియేషన్స్
Producerధర్మకర్త.సి
Directorప్రవీణ్ శ్రీ
Musicఇళయరాజా
Photography అనిల్ భండారి 
Storyరామ్ గోపాల్ వర్మ
Dialougeగంధం నాగరాజు,రవిరెడ్డి మల్లు
Lyricsభాస్కరభట్ల రవిఉకుమార్‍,
వనమాలి,కలువకృష్ణ
సాయి,అనంత శ్రీరామ్,
Editingప్రవీణ్ పూడి
Artధర్మేంద్ర
Choreography----
Actionరామ్ -లక్ష్మణ్
Star Castజగపతిబాబు,విమలా
రామన్,రేవతి,
శివకృష్ణ,కోట శ్రీనివాస
రావు,తనికెళ్ళ భరణి,
కోట ప్రసాద్,జీవా,
రవికాలే,టార్జాన్,
అన్నపూర్ణ
తదితరులు...

TeluguOne Rating
2.75/5
Release Date
3-9-2010
Story
ఈ చిత్రం కథ గతంలో వచ్చిన "గాయం"చిత్రానికి ఎక్స్టెటెన్షన్ మాత్రమే.కొత్త కథేం కాదు.ఇక కథలోకి వస్తే గాయం సినిమాలోని దుర్గా బ్యాంకాక్ లో రామ్(జగపతిబాబు) అని తన పేరు మార్చుకుని,ఒక రెస్టారెంట్ పెట్టుకుని,విద్య(విమలారామన్)అనే అమ్మాయిని పెళ్ళిచేసుకుని ఏ గొడవలూ లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతుంటాడు.అయితే అక్కడ కొందరు నీగ్రోలు అతని రెస్టారెంటుకి,వేళకాని వేళలో వచ్చి,గొడవ చేస్తుంటే అనుకోకుండా వాళ్ళని కాల్చటంతో అక్కడి మీడియా దుర్గాని ఒక హీరోలా ఎలివేట్‍ చేస్తుంది.ఆ వీడియో క్లిప్పింగ్ ని ఇండియాలో ఉన్నగురునారాయణ (కోటశ్రీనివాసరావు)కొడుకు శంకర నారాయణ(కోట ప్రసాద్)చూసి అతన్ని వెంబడిస్తాడు.అప్పుడు జరిగిన గొడవలో రామ్ రివాల్వర్ తో ప్రత్యర్థిని కాలిస్తే అతని రక్తం విద్య ముఖం మీద పడుతుంది.దాంతో విద్య అతన్ని ఒక క్రిమినల్ గా చూసి అతన్నించి విడిపోవాలనుకుంటుంది.పోలీసాఫీసర్ పాండ్యన్(జీవా)చెప్పిన మాటలకు మనసు మార్చుకున్న విద్య తన భర్తను అతని గతం గురించి అడుగుతుంది.దుర్గా తన గతం గురించీ చెపుతూంటాడు.అదే సమయంలో వారి మీద శంకరనారాయణ మనుషులు కాల్పులు జరుపుతారు.ఆ కాల్పుల్లో దుర్గా కొడుకు గాయపడతాడు.ఇక అప్పుటి నుంచి దుర్గా తిరగబడతాడు.భార్యను,కొడుకుని బ్యాంకాక్ లోనే ఉంచి హైదరాబాద్ కి వచ్చి,బ్యాంకాక్ లో తన మీద దాడి చేయటానికి కారకులైన గురునారాయణ మనుషుల్ని చంపుతాడు.అక్కణ్ణించీ దుర్గా,గురునారాయణల మధ్య జరిగే గ్యాంగ్ వార్ లో,గురునారాయణ లాయర్ మీద శంకర నారాయణకి అనుమానం కలిగేలా చేసి శంకరనారాయణ చేతే ఆ లాయర్ చనిపోయేలా చేస్తాడు దుర్గా.ఆ తర్వాత శంకర నారాయణ కూడా దుర్గా చేతిలో చనిపోతాడు.ఆ తర్వాత గురునారాయణ ఏం చేశాడు...?దుర్గా దాన్ని ఎలా ఎదుర్కొన్నాడూ అన్నది మిగిలిన కథ.
Analysis
దర్శకుడు కొత్తవాడైనా ఈ సినిమాని బాగానే హ్యాండిల్ చేయగలిగాడనే చెప్పాలి.సినిమా తొలి సగం ఉన్నంత బాగా సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే ఇది చాలా పేద్ద హిట్టయ్యి ఉండేది.కానీ సెకండ్ హాఫ్ ఒక మోస్తరుగా నడపటంతో మామూలు సినిమాగా మారింది.దానికి స్క్రీన్ ప్లే కారణమని చెప్పాలి.అయినా దర్శకుడు పాత "గాయం"చిత్రాన్ని ఈ చిత్రంతో కలిపిన తీరు,ఆ చిత్రాన్ని ఈ చిత్రానికి వాడుకున్న తీరూ బాగుంది.దానికి తగ్గట్టే రేవతి,శివకృష్ణ,కోట,తనికెళ్ళ భరణిలతో పాటు హీరో జగపతి బాబు కూడా కాలానుగుణంగా కనపడతారు. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి.నేడు ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అంటూ ఆత్మహత్యలతో తమ ప్రాణాలను పణంగా పెట్టే విద్యార్థలు, నేటి రాజకీయ నాయకులు తమ జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో,ఎలా తమను తమ రాజకీయావసరాలకు వినియోగించు కుంటున్నారో ఈ చిత్రం ఒకసారి లోతుగా పరిశీలించి చూస్తే వారికి అర్థమవుతుంది.ఈ చిత్రంలోని గురునారాయణ పాత్రను దర్శకుడు ఈ విషయం నేటి విద్యార్థులకు చెప్పటానికి బాగా వాడుకున్నాడు.ఈ చిత్రం చుసిన పదిమంది విద్యార్థులు వాస్తవం గ్రహించినా ఈ సినిమాకి సార్థకత.
నటన - నటన విషయానికొస్తే జగపతిబాబు గాయం చిత్రం కన్నా ఈ చిత్రంలో తను చెప్పినట్టే నిజంగా బాగా నటించాడు.విమలారామన్ కూడా తన నటనలో పరిణితి కనపరిచింది.ఇక కోట శ్రీనివాసరావు నటన గురించి చెప్పటం హాస్యాస్పదమవుతుంది.ఆయన గురునారాయణ పాత్రకు జీవం పోశాడు.ఆయన కొడుకు కోట ప్రసాద్ కూడా బాగా నటించాడు.ఈ చిత్రంలో తన కొడుకు చనిపోయినప్పుడు నటించిన సీన్,కోట శ్రీనివాసరావుకి దేవుడు నిజ జీవితంలో జరిగే సంఘటనకు రిహార్సిల్ చేయించినట్లనిపించింది. ఇక మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సంగీతం- ఇళయరాజా సంగీత దర్శకత్వంలోని ఈ చిత్రంలోని పాటలు వినసొంపుగా,చక్కగా,శ్రావ్యంగా ఉన్నాయి.రీ-రికార్డింగ్ కూడా సీన్ మూడ్ ని ఎలివేట్ చేసేలా ఉండి బాగుంది.
సినిమాటోగ్రఫీ - చాలా నీట్ గా ఉంది.లైటింగ్ స్కిమ్ కూడా బాగుంది.
మాటలు - అవసరమయినంత వరకూ మాత్రమే ఈ చిత్రంలోని మాటలు మనకు వినిపిస్తాయి.కానీ ఆ ఉన్న కొన్ని మాటలు కూడా పదునుగా ఉండటం విశేషం.
పాటలు - ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా అర్థవంతంగా,సందర్భోచితంగా సాహిత్యపు విలువలతో ఉన్నాయి.
ఎడిటింగ్ - బాగుంది.
కొరియోగ్రఫీ - ఈ సినిమాకి కొరియోగ్రఫీ అవసరం లేదు.ఎందుకంటే వెర్రి మొర్రి గంతులేయాల్సిన పాటలు ఈ చిత్రంలో లేనేలేవు.
యాక్షన్ - హీరో తంతే మనుషులు గాల్లోకి ఎగరటాలు,ఎముకలు విరగటాలూ గట్రాల వంటివి ఈ చిత్రంలో ఉండవు.ఈ చిత్రంలో చాలా సహజంగా ఉండేలా యాక్షన్ కొరియోగ్రఫీని కంపోజ్‍ చేశారు.
TeluguOne Perspective
"గాయం"సినిమా చూసినా చూడకపోయినా,ఏ అంచనాలు లేకుండా గనక ఈ సినిమా చూస్తే ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేస్తారు.ఈ సినిమా ఒకసారి చూడవచ్చు.ఫరవాలేదు.







"ఆయన వద్దు రాజమౌళే ముద్దు"-చిరు (Aug 27 10)

మెగాస్టార్ ‍,పద్మభూషణ్,డాక్టర్ చిరంజీవి గత ముప్పై యేళ్ళుగా తెలుగు సినీ పరిశ్రమలో రారాజుగా యేలి,రాజకీయాల్లో వెళ్ళారు. దాంతో ఆయన అభిమానులు నిరాశపాలయ్యారు.ఆయన్ని ఆయన కొడుకులో చూసుకుంటూ వాళ్ళు తృప్తిపడుతున్నారు.ఇన్నాళ్ళకు వారి కోసం మళ్ళీ మెగాస్టార్ సినిమాలో నటించే ఆలోచనలో ఉన్నారు.ఒకవేళ మీరు మళ్ళీ సినిమాల్లో నటిస్తే మీరు దర్శకేంద్రుడు, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించటానికి ఇష్టపడతారా...? లేక ఆయన శిష్యుడు రాజమౌళి దర్శకత్వంలో నటించటానికిష్టపడతారా...?అని ఆయన్ని ఒక ఇంటర్ వ్యూలో అడిగితే ఆయన రాజమౌళి పేరే చెప్పారు



Movie Name"కొమరం పులి"TeluguOne's Rating : 2.5/5
Bannerకనకరత్నా మూవీస్ 
Producerశింగనమల రమేష్
Directorయస్.జె.సూర్య
Musicఎ.ఆర్.రెహమాన్
Photographyవినోద్ ప్రథాన్
Storyయస్.జె.సూర్య
Dialougeసిప్పి
Lyricsచంద్రబోస్
Editingప్రభాకరన్
Artఆనందసాయి
Choreographyఅహ్మద్ ఖాన్
Actionవిజయన్,టిను
Star Castపవన్ కళ్యాణ్‍,
నికీషా పటేల్ (తొలిపరిచయం),
మనోజ్ వాజ్‍ పాయ్,చరణ్ రాజ్,
నాజర్,ఆలీ,జ్యోతికృష్ణ,బ్రహ్మాజీ,
వియమ్ సి హనీఫా,చిత్రం శ్ర్తీను,
శ్రేయా శరణ్,కోవై సరళ,శరణ్య,
ఆలపాటి లక్ష్మి,
కాదంబరి కిరణ్  తదితరులు...
TeluguOne Rating
2.5/5
Release Date
10-9-2010
Story
ఒక తాండాలో ఒక పోలీసాఫీసర్ భార్య(శరణ్య)తన భర్త కనపడటం లేదని పోలీస్ స్టెషన్ కి వెళ్ళి అడిగితే అక్కడి పోలీసాఫీసర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెపుతారు.దాంతో తన భర్త వెళ్ళిన అల్ సలీమ్(మనోజ్ వాజ్ పాయ్)అనే గూండా దగ్గరికి వెళితే అతను ఆమెను చంపబోతాడు.కానీ ఆమె తప్పించుకుని అయ్యప్ప గుడిని చేరి,ఆ దేవుణ్ణి తనకు అన్యాయానికి ప్రశ్నిస్తుంది.దానికి సమాధానంగా ఆమెకు వేవిళ్ళు అవుతాయి.ఆమె ఆ గుళ్ళోనే నిండు గర్భవతిగా ఉన్నప్పుడు మళ్ళీ అల్ సలీమ్ చంపటానికి ప్రయత్నిస్తే అతన్నుంచి తప్పించుకుని ఒక లోయలో నీళ్ళల్లో పడి అక్కడే ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది.ఆ బిడ్డను పోలీసాఫీసర్ని చేస్తుంది.అతనే కొమరం పులి (పవన్ కళ్యాణ్).మలేసియా వెళ్ళిన మన ప్రథాన మంత్రిని నిక్సన్ అనే మాఫియా డాన్ చంపబోతే పులి ఆయన్ని కాపాడతాడు.దానికి ప్రతిగా పులిని ప్రథాన మంత్రి గౌరవించబోతే తనకా గౌరవం వద్దనీ,పోలీస్ స్టెషన్ కి వెళ్ళిన ప్రజలకు న్యాయం జరుగక పోతే,ఆ పోలీసాఫీసర్ తోనే న్యాయం చేయించేలా తనకు ఒక టీమ్ నివ్వాలనీ కోరతాడు పులి.అప్పటి నుంచీ ఎవరికి పోలీస్ స్టెషన్లో న్యాయం జరక్కపోయినా పులికి ఫోన్ చేయటం వారికి పులి న్యాయం జరిగేలా చూడటం జరుగుతుంటుంది.పిచ్చాసుపత్రి నుంచి ఒకావిడ(ఆలపాటి లక్ష్మి)పులికి ఫోన్ చేసి తన ఒక్కగానొక్క కొడుకు హుస్సేన్ని పోలీసాఫీసర్ ను చేస్తే అతనే కనపడకుండా పోయాడని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె పులికి చెపుతుంది.హుస్సేన్ గురించి విచారిస్తున్న పులికి తీగలాగితే డొంక కదిలినట్టు,అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మాఫియా డాన్ అల్ సలీమ్ ఎదురవుతాడు.అల్ సలీమ్ ని పులి ఎలా ఎదుర్కొన్నాదనేది మిగిలిన కథ.
Analysis
యస్.జె.సూర్యలో ఉన్న పర్ వర్షన్ ఈ సినిమాలో బాగా కనిపించింది.పులిని అతని తల్లి నీళ్ళల్లో కనటం కొంచెం విపరీతంగా అనిపిస్తుంది.ఆడదానికి ఒక బిడ్డకు జన్మనివ్వటం అంటే చచ్చి బ్రతికినంతపని.మరో జన్మ ఎత్తినట్లే.అలాంటిది ఎవరి సాయం లేకుండా ఒక ఆడ మనిషి స్వయంగా పురుడు పోసుకోవటమే దాదాపు అసాథ్యం అయితే ఆ పురుడు ఒక లోయలో పడి,కాళ్ళు అందీ అందని లోతులో నిలబడి బిడ్డను కనటం ఒక్క ఈ కొమరం పులి చిత్రంలోనే సాథ్యం.ఇక పులి మలేసియాలో ప్రథాన మంత్రిని కాపాడే సీన్లో బిల్డింగుల మీద నుంచి ఎగరటం,పక్కా ప్రణాళికతో ప్లాన్ చేసుకున్న మాఫియా బ్యాచ్ ని రక రకాలుగా చంపటం కూడా హాలీవుడ్ సినిమా "మాట్రిక్స్"స్థాయిలో చిత్రీకరించాలని ప్రయత్నించినా అది సైంటిఫిక్ మూవీ...ఇది కొమరం పులి చిత్రం.ఆ టైపు ఫైట్లు ఎందుకనో ఈ సినిమాలో సెట్ కాలేదనిపిస్తుంది.ఒక అంతర్జాతీయ స్థాయి మాఫియా డాన్ నో పార్కింగ్ లో పెట్టిన కారుని పోలీసోళ్ళు తీసుకెళ్తే అంతగా ఎందుకు గింజుకుంటాడో మనకర్థం కాదు.ఇక హీరోయిన్ని డ్యూప్లికేట్ పోలీస్ గా పరిచయం చేసే బదులు నిజమైన పోలీసాఫీసర్ గానే పరిచయం చేసి ఉండాల్సింది.పోనీ ఆలీతో కామెడీ కోసమా అంటే ఆ కామేడీ కూడా పండిన దాఖలాల్లేవు.నికీషా పటేల్ హీరోని పెళ్ళి చేసుకునే తీరు మరింత హాస్యాస్పదం.ఆమె అతన్ని ఫస్ట్ నైట్ అవ్వలేదని టీజ్‍ చేసే సీన్లో పులి గాత్రం పిల్లిలా మారటం కామెడీ పండించలేదు సరికదా,పులి పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీసిందని చెప్పాలి.ఇక నిక్సన్ పులి పక్కనే ఉన్నా అతని మీద పులికి అనుమానం రాకపోవటం ఆశ్చర్యంగా ఉంటుంది.ఈ సినిమాలో ప్లస్ పాయింటేమిటంటే పులి పాత్రలో పవన్ కళ్యాణ్ ఒక పోలీసాఫీర్ కి,ముఖ్యంగా ప్రజలకి ఉన్న సామాజికి బాధ్యతని తెలియజెప్పటం.కాకపోతే అది ఉపన్యాసంలా కనిపించి కాస్త అతి అనిపించింది.
నటన- పవన్ నటనలో అదే స్పీడ్...అదే స్టైల్.పులి పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు.కాకపోతే గుర్తొచ్చినప్పుడు డైలాగుల్లో తెలంగాణా మాండలీకాన్ని ఉపయోగించటం కాస్త కృతకంగా ఉంది.నికీషా పటేల్ బాగానే నటించింది కానీ ఆమె కంటే ఇంకా బెటర్‍ హీరోయిన్ని తీసుకునుంటే బాగుండేది.ఆమే ఈ చిత్రానికి మైనస్ అనిపిస్తుంది.పులి తల్లిగా శరణ్య చక్కగా నటించింది.మనోజ్ వాజ్ పాయ్ నటన ఏ కోశానా ఆకట్టుకోలేదు సరికదా అతను విలనీ చేస్తున్నాడా,కామేడీ చేస్తున్నాడా అన్నది అర్థం కాకుండా తిక్కల తిక్కలగా ఆ పాత్ర పయనించిన తీరు అతి అనిపించింది.నాజర్, చరణ్ రాజ్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.ఆలీ కామెడీ పెద్దగా పండలేదు.
 సంగీతం- ఈ చిత్రంలోని పాటల్లో సాహిత్యం ఒక్కో పాటలో మనకర్థం కాదు.ట్యూన్లు బాగున్నా తమిళ వాసన కొడతాయి."నిర్భయమీయరా స్వామీ", "చెకుముకే చెకుముకే","పవర్ స్టార్"పాటలు వినటానికి బాగున్నాయి.రీ-రికార్డింగ్ ఫరవాలేదు.
 మాటలు - తమాషాగా ఉన్నాయి.తెలుగుదనం శరణ్య,పవన్ కళ్యాణ్ డైలాగుల్లోనే కనపడుతుంది.హీరో పాత్ర తెలంగాణా మాండలీకాన్ని వాడిన తీరు కూడా వివాదాస్పదమవుతుంది.మొత్తం ఆ మాండలీకంలోనే వాడినా బాగుండేది.సగం కోస్తా తెలుగు భాష,అప్పుడప్పుడు తెలంగాణా తెలుగు వాడటం రచయిత పరిణితి స్థాయిని తెలియజేస్తుంది.
 పాటలు - చంద్రబోస్ పడ్డ కష్టం అంతా సంగీతం హోరు మింగేసింది. సినిమాటోగ్రఫీ - ఇది చాలా బాగుంది.కంప్యూటర్ గ్రాఫిక్స్ కీ,ఒరిజినల్‍ షాట్ కీ తేడా తెలియనంత బాగా ఈ చిత్రంలోని ఫొటోగ్రఫీ ఉంది.
ఎడిటింగ్ - ఒ.కె.ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తుంది.
ఆర్ట్ - బాగుంది.హీరో ఇంటి సెట్ పులి ఆఫీస్ సెట్ ఇలా అన్నీ బాగున్నాయి.
కొరియోగ్రఫీ - చెప్పుకునే స్థాయిలో లేదనే చెప్పాలి.
యాక్షన్ - ఇది బాగుంది.ఇద్దరు ఫైట్ మాస్టర్లు ఈ చిత్రంలోని ఫైట్లు కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు.కాకపోతే బిల్డింగుల పై నుంచి ఎగరటాలే ప్రేక్షకుడికి జీర్ణం కావనిపిస్తుంది.
TeluguOne Perspective
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఉన్న భారీ అంచనాలను ఈ చిత్రం అందుకోకపోవటమే పెద్ద మైనస్.అలా కాకుండా ఒక మామూలు సినిమా అనుకుని చూస్తే మీరీ సినిమాని ఎంజాయ్ చేస్తారు.
.      


Related Posts with Thumbnails