Political

జగన్ దీక్ష కోసం స్థల పరిశీలన

విజయవాడ: యువనేత, మాజీ ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి దీక్ష కోసం స్థలాన్ని అంబటి రాంబాబు, భూమన కరుణాకర రెడ్డి ఇక్కడ పరిశీలించారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 21, 22 తేదీలలో లక్ష మంది రైతులు, చేనేత కార్మికులతో 48 గంటలపాటు దీక్ష చేస్తానని జగన్ బందరు సభలో ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటించిన ప్రకారం లక్ష మంది దీక్ష చేయడానికి అనువైన స్థలం కోసం వారు ఇక్కడ నాలుగైదు ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ హైటెక్ సిటీ వద్ద, కృష్ణా నది వద్ద, తాడేపల్లి వద్ద స్థలాలను పరిశీలించినట్లు చెప్పారు. ఇంకా రెండు ప్రాంతాలను పరిశీలించవలసి ఉందన్నారు. దీక్షకు ఒక లక్ష మంది వరకు వస్తారని ఆయన చెప్పారు.













దటీజ్.. చంద్రబాబు.!!!

రైతుల సమస్యలపై చంద్రబాబు గదుల్లో కూర్చొని మాట్లాడటం మాని ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడాలని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు సవాల్ విసిరారు. దీన్ని స్వీకరించిన చంద్రబాబు.. రైతుల సమస్యలపై ధర్నా చేసేందుకు పాలమూరు జిల్లాను ఎంచుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన ఆ జిల్లాకు సోమవారం బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న తెరాసకు చెందిన కొంతమంది నేతలు కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకోవడమే కాకుండా రాళ్లు రువ్వి కారు అద్దాలు పగులగొట్టారు. అసలే ఎత్తుకు పైఎత్తులు వేసే చంద్రబాబు.. ఈ రాళ్ల దాడిని రాజకీయ అస్త్రంగా ఎంచుకున్నారు. దాడితో ఆగ్రహోద్రుక్తుడైన చంద్రబాబు తెరాసపైనా.. ఆ పార్టీ అధినేతపైనా విమర్శల దాడికి దిగారు. తెరాస విధానాలనూ తూర్పారబట్టారు. లక్ష్య సాధన కోసం శాంతియుతంగా జరపాల్సిన ఉద్యమాన్ని ఉద్దేశ్యపూర్వకంగా హింసాత్మకం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రైతు సమస్యలపై పోరాడుతున్న తమపై దాడి చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అన్నదాతకు ఎక్కడ ఏ కష్టమొచ్చినా అక్కడకు తాను వెళతాననీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధమని ప్రకటించారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు దిగారు. ఈ ధర్నాతో ముఖ్యమంత్రి రోశయ్య కూడా దిగివచ్చారు. స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్‌ వైఖరిని ఎండగట్టారు. తెలంగాణ కోసం తాను బతుకుతున్నానని చెప్పుకుంటున్న కేసీఆర్.. ఏనాడూ ఈ ప్రాంత సమస్యల కోసం పోరాటం చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కైన కేసీఆర్ తమపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి వల్ల తెలంగాణకు నష్టమేగానీ ఏమాత్రం లాభంలేదన్నారు. ఇలా చంద్రబాబు సాగించిన ప్రసంగం పార్టీ శ్రేణులను కదిలించింది. దాడికి ముందు స్తబ్దుగా ఉన్న పార్టీ శ్రేణుల్లో ఒక్కసారి ఉత్సాహం పెల్లుబికింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణలో పర్యటించి తీరుతానని బాబు శపథం చేశారు. ప్రజా సమస్యలే తనకు ముఖ్యమని తేల్చి చెప్పారు. వారి కోసం దేనికైనా సిద్ధమని కుండబద్ధలుకొట్టారు. అలా.. ఒకే ఒక సంఘటనను చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకుని కేసీఆర్‌ను కడిగి పారేయడమే కాకుండా డిఫెన్స్‌లో పడేశారు.

జగన్ తట్టుకోవడం కష్టమే
జగన్ కంపెనీలకు సంబంధించి రెండు అంశాలను ప్రధానంగా చేసుకుని ఐటీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును సాగిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకటి.. జగన్ కంపెనీల్లోకి వివిధ సంస్థలు వ్యక్తుల ద్వారా ప్రవహించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి(మనీలాండరింగ్ ఆరోపణలు)? రెండు విదేశీ పెట్టుబడుల నిబంధనలను జగన్ కంపెనీలు ఉల్లంఘించాయా? స్థూలంగా ఈ ఆరోపణలు కంపెనీల చట్టం విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం అక్రమ నిధుల చలామణి నిరోధక చట్టం.. పరిధిలోకి వస్తాయి. దివంగత నేత వైఎస్ ఇమేజ్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలను గమనించిన అధిష్ఠానం.. జగన్ అక్రమ ఆస్తులు సంపాదన విషయాన్ని చట్టాల ఉల్లంఘనను తమ చేతికి మట్టి అంటకుండా చట్ట సంస్థల ద్వారానే బయటకు వచ్చేట్టు చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. వైఎస్ వారసుడిగా దీన జన రక్షకుడిగా పాజిటివ్ ఇమేజ్‌తో జగన్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న ఆయన వర్గీయులకు ఇది ఊహించని దాడి. నేరుగా ఆర్థిక మూలాలపై దెబ్బ తగిలితే జగన్ తట్టుకోవడం కూడా కష్టమే


సోనియా ఇంట్లో చప్రాసీగిరీ చేస్తున్న-కేసీఆర్‌

తెలంగాణ కేసీఆర్‌ కుటుంబం జాగీరు కాదని తెలంగాణ గురించి మాట్లాడుతున్న కేసీఆర్‌కు దమ్ముంటే తమతో ఢిల్లీకి వచ్చి సోనియాగాంధీ ఇంటి ముందు ధర్నా చేసే దమ్ముందా అని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి సవాల్‌ చేశారు. �తెలంగాణపై మీ విధానం చెప్పాలని డిమాండ్‌ చేసేందుకు మేమంతా సోనియా ఇంటివద్దకు ధర్నాకు సిద్ధంగా ఉన్నాం. మాతో పాటు వచ్చి సోనియాను నిలదీసే దమ్ము ధైర్యం చిత్తశుద్ధి బాబుకు ఉందా� అని ప్రశ్నించారు. మా పార్టీ భిక్ష కార్యకర్తల కష్టంతో చచ్చీ చెడీ గెలిచిన ఎంపీ పదవిని తెలంగాణ ప్రజల సమస్యల ప్రస్తావన కోసం వినియోగించని కేసీఆర్‌ తక్షణం తన పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ఊడిగం చేసేందుకే కేసీఆర్‌ టిడిపి నేతల పర్యటనలను అడ్డుకుని సమస్యల తీవ్రతను ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా అడ్డుపడు తున్నారని ఆరోపించారు. మంగళవారం రేవంత్‌ సూర్యతో మాట్లాడారు. �తెలంగాణ తెచ్చేదీ ఇచ్చేదీ తామేనని కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కాకాలు కేకేలు ఎమ్మెస్‌లు డిఎస్‌లు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చెబుతుంటే కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై పోరాడకుండా మాపై దాడులు చేయిస్తున్నారంటే ఆయన సోనియా ఇంట్లో చప్రాసీగిరీ చేస్తున్నందుకే ఆమెను విమర్శించడం లేదని అర్ధమవుతోంది.



ప్రజారాజ్యం పార్టీ సమావేశం రసాభస

నాయకులు ఉన్నారా.... ఉంటే ఏమైపోయారు.. చిరంజీవి వస్తేనే బయటకి వస్తారా.. కార్యకర్తలను పట్టించుకునే నాధుడే లేదు.. ఏదైనా సమస్య వస్తే ఎవరితో చెప్పుకోవాలంటూ పలువరు ప్రజారాజ్యంపార్టీ కార్యకర్తలు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమావేశం కొంతసేపు రసాబాసగా మారింది. మంగళవారం పాలకొల్లు త్యాగరాజ వర్తక గుమస్తాల సంఘ భవనంలో పిీఆర్�పిీ సమావేశం జరిగింది. సమావేశంలో పలువురు కార్యకర్తలు పీఆర్�పికి ప్రజల్లో అభిమానం ఉందని చిరంజీవిని ఆదరించే వారు ఉన్నారని అయితే వారిని చైతన్య పరిచి పార్టీలోనికి తీసుకువచ్చేందుకు కృషి చేసే నాయకులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్�పి కార్యకర్త తోట రాంబాబు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు కృషి చేయాలని వారికి కార్యకర్తలు అన్ని విధాల సహకరించేందుకు సిద్ధ్దంగా ఉన్నారని అన్నారు. పాలకొల్లులో సమర్థవంతమైన నేతలు ఉన్నారని అయితే కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని అన్నారు. సమర్థత గల నాయకుడిని మాకు ఇస్తే నియోజకవర్గంలో పిీఆర్�పి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు.



జగన్ ‘ఓదార్పు’కు బ్రేక్


 జగన్ ‘ఓదార్పు’కు బ్రేక్
ప్రకాశం: ప్రకాశం జిల్లా దర్శిలో బుధవారం జరగనున్న జగన్ ఓదార్పు యాత్రకు ఇన్‌ఫెక్షన్ బ్రేక్ పడిండి. కంటి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న వైఎస్ జగన్ వైద్యుల సలహా మేరకు నేడు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. దీంతో నేడు జరగునున్న ఓదార్పు యాత్ర రద్దు అయ్యింది. కాగా రేపటి జగన్ ఓదార్పు యాత్ర యథాతథంగా జరుగుతుందిని కాంగ్రెస్ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు


చిరుపై రోశయ్య విమర్శనాస్త్రాలు


హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య ప్రజారాజ్యం ఆధినేత చిరంజీవిపై పరోక్ష విమర్శలు చేశారు. కొందరు నాయకులు ప్రజలలో సానుభూతి కొట్టేయడానికి స్వార్థంతో రాజకీయ ప్రయోజనాలు ఆశించి ధర్నాలు, రాస్తారోకోలు, అరెస్టులు అంటూ నాటకాలాడుతున్నారని చిరును ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపైనా ప్రత్యక్ష విమర్శలకు దిగారు. చంద్రబాబు రైతుల విషయంలో ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఎరువుల కొరత ఉన్నప్పటికీ అది కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉందని అన్నారు.

Related Posts with Thumbnails